జన్మించిన ప్రతి మనిషి ఇల్లు కడతాడు అనే నియమం లేదు.

 జన్మించిన  ప్రతి మనిషి ఇల్లు కడతాడు 

                                             అనే నియమంలేదు..... 



                               https://youtu.be/gXY9ZPqJGkk

 ప్రపంచములో ప్రతి మానవుడి కల
సొంత గృహమును తన దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారముగా నిర్మించుకోవాలని, లేదా తన  కలకు అనుగునంగా అంటే ఒకరు 5స్టార్ హోటల్ లో లాగా నిర్మించుకోలేని, ఒకరు పురాతన మహల్ లాగా న నిర్మించుకోవాలి అని  , మరిఒకరు సంప్రదా గృహం 
నిర్మించుకోవాలి అని,
మరొకరు మోడరన్ హౌస్ నిర్మించుకోవాలి అని, మరొకరు సాదారణముగా  తమ కుటుంబ సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్మించుకోవాలి అని, మరొకరు
పురాతన  యుగం  నాటి కోట లాగా  గృహాన్ని   నిర్మించుకోవాలి అని, మరి కొందరు రాజుల వంశముల పరంపరగా గృహాన్ని నిర్ముంచుకుంటారు ,
మరికొందరు తాము జన్మించిన  వంశ  ఆచారాలను , విధానాలను పాటిస్తూ గృహాన్ని నిర్ముంచుకొంటారు , మరి కొందరు ధనము ,డబ్బు , ఆస్తులు  ఉన్న కూడా జీవిత రహస్యాన్ని  తెలుసుకుని  గుడిసెలలో నివసిస్తుంటారు ,
                               మరి కొందరు తమ చుట్టూ ఉన్న పరిసరాల ప్రకారంగా నివసిస్తారు అంటే కేరళ  రాష్ట్రము లో సాధారణముగా పడవలపైన  గృహాన్ని కట్టుకొని మరికొందరు  నివసిస్తారు ,మరి కొందరు  తమ మేధశ్శక్తి  ఉపయోగించి తమకు  నచ్చిన విదంగా మోడరన్ అంటే గృహం మొత్తము రిమోట్ కంట్రోల్ సహాయముతో అన్ని పనులు జరిగేవిదంగా నిర్మించుకుంటారు . 

కానీ మనము ఆలోచిస్తే , డబ్బు  సంపాదించినా ప్రతి  గృహాన్ని  సొంతగా  నిర్మించుకుంటాడు అని నియమము లేదు,         
                        కొందరు  తాము సంపాదించినా ధనాన్ని రెంట్టిపు చేయాలనీ గృహాన్ని నిర్మించుకోరు, మరికొందరు  డబ్బు సంపాదించడం  ఆధునిక యుగం లో కష్టం అని భావించి ధనాన్ని, గృహాన్ని నిర్ముంచుకోవడం లో వృధా  చేయరు, మరి కొందరు కమర్షియల్ గా రెంట్ గృహాలను  నిర్మించి  ధనాన్ని సంపాదిస్తారు , కానీ వారు మాత్రం ఇంకా రెంట్ గృహం లో నే  జీవనం సాగిస్తారు , ఈ లాంటి  స్వభావం ఉన్న వ్య్కక్తులను నేను కొందరిని చూసాను, 

భూమిమీద  నివసిస్తున్న ప్రతి మానవుడు గృహాన్ని కట్టుకుంటాడు  అనేది  ఎలాటి నియమము లేదు, 
 ఎందుకంటె  తమ  తల్లి తండ్రుల ద్వారా  నిర్మించిన గృహంలో  నివసిస్తారు  కొందరు, మరి కొందరు తమ వారసత్వన్గా చెందిన గృహాలలో నివసిస్తారు ,
మరి కొందరు తాము కడుపు కూటికోసం చేస్తున్న వృత్రి ద్వారా సంపాదించినా  డబ్బు, నూతన గృహం కట్టడానికి సరిపోక రెంట్  హౌసెస్ లో నివసిస్తారు,
                              ఉత్తర భారత దేశం లో, కొన్ని కొన్ని  గ్రామాలలో,
 కొందరు సంచార మానవులు ఉంటారు ,దీని  అర్థం ఏమిటంటే , వారు  తమ కుటుంభం సభ్యులతో కలిసి  వాహనాలలో  సంచరిస్తూ ఉంటారు  , తమ కడుపు కూటి  కోసం మరియు డబ్బు ను  సంపాదించడానికి  నగరాలు దాటుతూ , రాష్ట్రాలు దాటుతూ సంచరిస్తారు   తమ యొక్క వృత్రి ని  చేస్తూ,
                              ఇంకా మరికొందరు, అంటే  కడు పేదవారు    తమ  కడుపు నింపుకోవడం కోసం అనేక పనులు చేసినా సరైన డబ్బు ను సంపాదించలేరు, తత్పలితంగా ఆ కుటుంబంలో అందరు సభ్యులు కడుపునిండా  ఒక పూటకు సరిపడా ఆహారాన్ని తినలేని పరిస్థితి ఇంకా  మన భారత దేశం లో నెలకొంది ,  
                            డబ్బు ను సంపాదించినా , దానిని సరైన పనులకు ,సరైన మార్గమములో ఖర్చుచేయడం తెలియక ,ఆధునిక  కాలంలో  యువత ఈ విధానాన్ని అవలంబించి , డబ్బు ను   బిజినెస్  పెట్టుబడి పెట్టి  100 మెంబెర్స్ లో 10 లేదా 20 మెంబెర్స్  మాత్రమే విజయం సాధిస్తున్నారు.  ఈ విదంగా డబ్బు పోగుట్టుకోవడం  కూడా  ఒక కారణంగా   మిగులుతుంది.. 


                     ఈ విదంగా ఆలోచిస్తూ  పొతే  చాల కారణాలు వలన, తమకు ఉన్న ఆశలలో ఒక  ఆశ, లేదా ఒక  కల, లేదా ఒక ధేయ్యం,  సొంత  గృహాన్ని  నిర్మించుకోడం  అనే అంశం  చిరస్థాయిగా  నిరించుకోలేని  కలగ మిగిలిపోతున్నాది  మానవుడికి  ఇప్పటికి కూడా 
            మరొక విదంగా ఆలోచిస్తే,  డబ్బును సంపాదించినా కూడా ,  ఆధునిక కాలంలో మానవుడు  కొత్త  కొత్త పుంతలతో ,కొత్త కొత్తగ  కనిపెట్టియినా అలవాట్లు ఇటీవల మానవుడిని  తన లక్ష్యాన్ని  చేరుకోనివ్వకుండా, మానవుడిని  ఆకర్షిస్తున్నాయి .  తత్పలితంగా  మానవుడు  వాటికీ అలవాటుపడి  రోజు రోజుకు బానిసగా మారుతున్నాడు .  ఈ విధమైన  అలవాట్లు వలన
          1  ఉదాహరణగా       డ్రగ్స్ అనే మత్తు పదార్థాలకు వినియోగించడం,  ప్రతిరోజు డ్రగ్స్  తీసుకోవడం ద్వారా, దానికి  బానిసగా మారిపోవడం , ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం, తల్లితండ్రుల మాట వినకపోవడం ,ఇష్టం వచ్చిన విధంగా జీవనశైలిని  పాటించడం  ఇటీవల జరుగుతుంది అనుటలో  అతిశయోక్తి లేదు.   
         ఒక సర్వే ప్రకారంగా  Census of India 2011.
             percentage of families owning a house
బీహార్                 96.8
జమ్మూ కాశ్మీర్     96.7
ఉత్తరప్రదేశ్            94.7
మణిపూర్             93.6
రాజస్థాన్               93.2
త్రిపుర                  91.9
మధ్యప్రదేశ్            90.9
కేరళ                    90.7
ఒడిశా                  90.4
ఛత్తీస్‌గఢ్              90.2
జార్ఖండ్                89.3
పశ్చిమ బెంగాల్     89.3
పంజాబ్                 88.9
హర్యానా                88.4
అస్సాం                  87.9
హిమాచల్ ప్రదేశ్      87.2
భారతదేశం              86.6
గుజరాత్                 83.9
ఉత్తరాఖండ్             82.9
మేఘాలయ            82
మహారాష్ట్ర            81.1
గోవా                  78.9
ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) 78.5
తమిళనాడు         74.6
కర్ణాటక               74.3
నాగాలాండ్         73.8
అరుణాచల్ ప్రదేశ్ 68.3
మిజోరం              65.8
సిక్కిం                64.5
లక్షద్వీప్             83.5
ఢిల్లీ                    68.2
పుదుచ్చేరి           64.9
A & N దీవులు    57.3
దాద్రా & నగర్ హవేలీ 55.6
చండీగఢ్             47.7
డామన్ & డయ్యూ 38.3

                                      పైన తెల్పిన  విదంగా బీహార్ రాష్ట్రములో మాత్రమే అత్యధికంగా సొంత గృహాలు  కలిగి ఉన్న ప్రజలు ఉన్నారు అని తెల్పుతుంది
                     ఇంకా దేశంలో చాల వరకు ప్రజలకి సొంత గృహాలు లేవు. దానికి చాల కారణాలు , కారణమై ఉండవచ్చు ,నేను పైన కొన్ని కారణాలు మాత్రమే తెలియజేశాను . 

2 ఉదాహరణగా   మద్యపానం అలవాటు,  దీని బారిన పడిన ఒక  సగటు మానవుడు , అనగా సమాజంలో యెన్నో రకాల వర్గాల ప్రజలు కలిసి నివశిస్తునాం . అందులో భాగంగా  ధనిక  వర్గం వారు,
పేద వర్గం  వారు ఉన్నారు.  ఈ సమాజం ప్రతి  మానవుడు రోజంతా కస్టపడి చివరగా   గృహానికి చేరుకొని కొంచము    మద్యపానం తీస్కొని  విశ్రాంతి తీసుకుంటాడు, కానీ  అధికముగా  రోజు రోజు తీసుకుంటూదానికి  బానిస  మారిపోయి , తన ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్నిమరియు  వక్తిగత గౌరవాన్ని కూడా  సమాజంలో  పోగుట్టుకుంటున్నాడు ,  తత్పలితంగా  సొంత గృహాన్ని  నిర్మించుకోవాలనే ఆశయాన్ని  మర్చి పోతున్నాడు .  
                                              ఇటీవల , ఆధునిక పోటీ ప్రపంచంలో  సొంత ఇంటి ని నిర్మించుకోవాలి అనే కల అందరికి ఉన్న ,కొందరికి'మాత్రమే సాధ్యం  అవుతుంది, ఈ విదంగా  చాల కారణాలు  ,  సొంత  ఇంటి  కళను  తీర్చుకోనివ్వడం లేదు.. 
            నా సర్వే, ద్వారా  తెలిసింది  ఏమనగా జన్మించిన  ప్రతి మనిషి ఇల్లు కట్టలేడు . 


మొట్ట మొదటి  కారణం  , పేదరికం , ఈ ఒక్క  కారణం భూమి మీద నివసిస్తున్నా మానవుడిని 
ప్రతి రంగం  లో  వెనకకి నెట్టే  అవకాశాన్ని  కలిగిస్తుంది. 
 
    ఇంకా రక రకాల  కారణాలు  ప్రభావితం చేస్తవి మానవుడిని  సొంత  ఇంటిని  నిర్మించుకోవాలని  దశలలో లేదా  ఆతని మార్గంలో ...... 
 








 




Comments